Wednesday, October 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీ బై పోల్‌కు ముగిసిన నామినేషన్లు

జూబ్లీ బై పోల్‌కు ముగిసిన నామినేషన్లు

- Advertisement -

– చివరి రోజు భారీగా దాఖలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18వ తేదీ వరకు 94 మంది 127 సెట్ల నామినేషన్ల దాఖలు చేశారు. 19, 20 తేదీల్లో సెలవు కాగా.. మంగళవారం నామినేషన్లు స్వీకరించారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. అలాగే, ఈ ఒక్కరోజే 160మందికిపై నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. మొత్తం ఇప్పటి వరకు 287కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ వికాస నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు.

చివరిరోజు భారీగా తరలివచ్చిన అభ్యర్థులు
నామినేషన్లకు మంగళవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. రీజినల్‌ రింగ్‌ రోడ్‌లో భూములు కోల్పోతున్న బాధిత రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మధ్యాహ్నం మూడు గంటలకే నామినేషన్ల గడువు సమయం పూర్తయినప్పటికీ అప్పటికే నామినేషన్లు వేయడానికి లైన్లలో ఉన్న వారందరి నామినేషన్ల దాఖలు పూర్తి అయ్యేవరకు కొనసాగించాలని అధికారులు ఆదేశించారు. దాంతో రాత్రి వరకు నామినేషన్ల పర్వం కొనసాగింది. నామినేషన్లను 22న(నేడు) పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 24 చివరి తేదీ. నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్‌ 14న చేపట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -