- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురా జిల్లాలోని అజ్హై, బృందావన్ రోడ్ స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆగ్రా-ఢిల్లీ మార్గంలో వెళ్తున్న కోల్ లోడెడ్ గూడ్స్ రైలు ఛటికార వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం ట్రైన్‌లోని 13 బోగీలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ పరిణామంతో ఆ రూట్‌లోని 34 రైళ్లు అలస్యంగా నడుస్తున్నాయి. అయితే, మెకానికల్ ఫెయిల్యూర్ (హాట్ ఆక్సిల్) సమస్య కారణంగా ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
- Advertisement -