Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిన్నారులకు కుర్చీలు, ప్లేట్లు పంపిణీ చేసిన మిత్ర ఫౌండేషన్

చిన్నారులకు కుర్చీలు, ప్లేట్లు పంపిణీ చేసిన మిత్ర ఫౌండేషన్

- Advertisement -

నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్  : కల్వకుర్తి పట్టణంలో మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్లప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం ముందుండే వారి అవసరాలను తీరుస్తున్న మిత్ర ఫౌండేషన్ సభ్యులకు కల్వకుర్తి పట్టణ ప్రజల ప్రశంసలు. సమాజ సేవా లో ఎప్పుడూ ముందుండే మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో బుధవారం సుభాష్ నగర్ కాలనీ అంగన్వాడీ సెంటర్‌లో చిన్న పిల్లలకు కూర్చునేందుకు కుర్చీలు, భోజనానికి ప్లేట్లు అందజేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం ద్వారా చిన్నారులు ఆనందంతో మురిసిపోయారు. ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ నేత మాట్లాడుతూ — “ప్రతి చిన్నారి సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకోవడం, ఆడుకోవడం మన సమాజ బాధ్యత” అని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ ఫౌండర్ చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షులు శ్రీకాంత్ నేత,అంగన్వాడీ టీచర్ అలివేలు,తల్లిదండ్రులు, మిత్ర సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -