విద్యుత్ షాక్ తో ఆవు మృతి ..

నవతెలంగాణ – నెల్లికుదురు

మండలంలోని మునిగిళ్ళ వీడు గ్రామం శివారు జయరాం తండాలో విద్యుత్ శాఖతో ఆవు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. బాధితుడు జైత్యా తెలిపిన వివరాల ప్రకారం.. ఆ గ్రామ శివారులో విద్యుత్ అధికారులు తక్కువ ఎత్తులో ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేశారని అన్నారు. నాకు ఉండబడిన ఆవు మేతమేసుకుంటూ వెళ్ళిన క్రమంలో విద్యుత్ శాఖ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. దీంతో సుమారు రూ.60,000 విలువగల ఆవును నష్టపోయానని తెలిపారు నష్టపరిహారం నాకు ఇప్పించేందుకు సంబంధిత అధికారులు ప్రభుత్వం చొరవ చూపి నన్ను ఆదుకోవాలని తెలిపారు.
Spread the love