Friday, June 5, 2026
E-PAPER
Homeకరీంనగర్పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత 

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత 

- Advertisement -
  • కౌన్సిలర్ రాకేష్ నాయక్ 
  • నవతెలంగాణ – రాయికల్
  • ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిమ ఫౌండేషన్, జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో స్వయం ఉపాధి శిక్షణ పొందుతున్న యువతీ,యువకులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మూడవ వార్డు కౌన్సిలర్ రాకేష్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే భవిష్యత్ తరాలకు పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీధర్ రెడ్డి,ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్లు రఘుపతి,శ్యామల,జిఎంఆర్ సిబ్బంది ప్రమోద్, నాగేందర్,చిరంజీవి,కృష్ణవేణి,వనిత, శిక్షణార్థులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -