Friday, June 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రాలలో అక్రమాలను అరికట్టాలి

ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రాలలో అక్రమాలను అరికట్టాలి

- Advertisement -

తెలంగాణ ప్రజా ఫ్రంట్..
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పక్షాన జిల్ల వ్యాప్తంగా వడ్ల కొనుగోలు ఐకెపి సెంటర్లలో పిఎసిఎస్ సెంటర్లలో జరుగుతున్న దోపిడి అక్రమాలను అరికట్టాలని ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాశపాక మహేష్, కార్యదర్శి రాసార నర్సింహా లు మాట్లాడుతూ..తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ గత మూడు రోజులుగా జిల్లాలోని మండలంలోని బస్వాపూర్, హుస్నాబాద్, బాలంపల్లి, రామచంద్రపురం, బొల్లెపల్లి, పలు గ్రామాల ఐకెపి సెంటర్లను సందర్శించడం జరిగిందని వర్షాకాలం ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్న  జిల్లా వ్యాప్తంగా వడ్ల కొనుగోలు సెంటర్ల కల్లాలలో కుప్పలుగా వడ్లు పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు.

ఐకెపి పిఏసిఎస్ సెంటర్లలో అక్రమాలు జరుగుతున్న ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారని, కొనుగోలు సెంటర్లో ప్రభుత్వం నిర్దేశించిన 41 కిలోను మించి 42.200 గ్రాములు 42.300 గ్రాములు కాంటా పెడుతున్నారని, తిరిగి మల్ల మిల్లర్లు 15 బస్తాలు కటింగ్ చేయడం జరుగుతుందని, ఇట్టి విషయమై ఐకెపి సెంటర్ నిర్వాహకులను అడిగితే వారు మిల్లర్ల పేరు చెబుతున్నారని, మిల్లర్లను అడిగితే మాకేమి సంబంధం లేదని అంటున్నారని అన్నారు. మరి ఐకెపి సెంటర్లను కొనుగోలు కేంద్రాలను మిల్లర్లు నడుపుతున్నారా లేదా దళారు నడుపుతున్నారా తెలియడం లేదని, ఇలా కటింగ్ పేరు మీద తూకం పేరు మీద రైతులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్న ప్రభుత్వం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు.

జిల్లా వ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఇదే సమస్యతో రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ బిజెపి పార్టీలో చోద్యం చూస్తున్నాయని కనీసం స్పందించడం లేదని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మరియు వ్యవసాయ మంత్రి రెవిన్యూ మంత్రి స్పందించాలని, జిల్లా కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో ఉన్నత అధికారులందరూ తక్షణమే ఐకెపి సెంటర్లను సందర్శించి ఈ దోపిడిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. తూకం పేరు మీద కటింగ్ పేరు మీద నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని, తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమౌతామని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా  సహాయ కార్యదర్శి రాసాల బాలస్వామి, జిల్లా కమిటీ సభ్యులు కూకుట్ల శ్రీశైలం, ఏనుగు మల్లారెడ్డి, చిక్కుల కరుణాకర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -