మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
పత్తి పంట విక్రయాల కోసం కపాస్ కిసాన్ యాప్ వినియోగం తప్పనిసరి అని ఆలేరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆలేరు మండలం టంగుటూరు గ్రామం ఎఫ్‌పిఓ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సి సి ఐ వారు ప్రత్తి కొనుగోళ్లను పారదర్శకంగా,సులభతరంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ ద్వారా మాత్రమే పత్తి అమ్మకాలు జరగనున్నాయన్నారు.రైతులు తప్పనిసరిగా గూగుల్ ప్లే స్టోర్ నుండి కపాస్ కిసాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని,తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. పత్తిని అమ్మాలంటే ముందుగా యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.రైతులు తాము ఎంపిక చేసిన మిల్లుకు,బుక్ చేసిన తేదీకి అనుగుణంగా పత్తిని విక్రయించవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈవో భార్గవి, ఎఫ్‌పిఓ నిర్వాహకులు మరియు రైతులు పాల్గొన్నారు.
పత్తి అమ్మకాలకు కపాస్ కిసాన్ యాప్ తప్పనిసరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES