Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముందుకు రాని కాంట్రాక్టర్లు

- Advertisement -

నవతెలంగాణ – సదాశివపేట
ఇందిరమ్మ మోడల్ ఇల్లు నిర్మించుకోవడానికి లబ్ధిదారులు సిద్దంగా ఉన్నా.. అందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలు కాకుండా ఒక లక్ష ఎక్కువగా ఇచ్చి నిర్మించుకునేవారు ఎంతోమంది లబ్ధిదారులు ఉన్నారు. మండల వాసులే కాకుండా తాడ్వాయి మండల చెందిన ఎంతోమంది లబ్ధిదారులు వచ్చి మోడల్ ఇల్లును చేశారు. గాంధారి రామారెడ్డి మాచారెడ్డి తదితర గ్రామాల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. కాంట్రాక్టర్ తోని కూడా మాట్లాడి నట్టు తెలిపారు. ఇందిరమ్మ మోరల్ నిర్మించేటప్పుడు కాంట్రాక్టర్లను ఇలా నిర్మించి ఇస్తారని లబ్ధిదారులు కాంట్రాక్టర్ ను అడిగారు. ఇప్పుడు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మించుకోవడంలో విఫలమవుతున్నట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిరుపేదలైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వమే నిర్మించుకోవడానికి సహాయము అందించాలని వారు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -