పింగల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్త దానం
కొడారి వెంకటేష్.. ఐఆర్సిఎస్ జిల్లా డైరెక్టర్
నవతెలంగాణ – భువనగిరి
సమాజం లోని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ( ఐ ఆర్ సి ఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా డైరెక్టర్ కొడారి వెంకటేష్ కోరారు. బుధవారం కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భువనగిరి జిల్లా ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సహజంగా రక్తాన్ని తయారుచేయడం అనే ప్రక్రియ లేదని , రోగులకు, క్షతగాత్రులకు రక్తం అవసరం పడితే ,మరొకరి నుండి రక్తాన్ని సేకరించాల్సి వస్తుందని ఆయన అన్నారు. మీరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలు కాపాడుతుందని, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పుట్టినరోజు, పెళ్ళిరోజు,ఇతర వేడుకల్లో రక్తదానం చేసి నలుగురికి ఆదర్శంగా నిలువాలని ఆయన కోరారు.
బీబీనగర్ పింగల్ అన్న సేవాదళ్ ఆధ్వర్యంలో దాతలు రక్తదానం చేసారు. అక్టోబర్ 22 (బుధవారం) రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి కి వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్త దాతలకు శుభాకాంక్షలు తెలిపి, సర్టిఫికెట్స్ అందజేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి హెచ్ ఓ డి డాక్టర్ స్వరాజ్యం , బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్స్ డాక్టర్ సుభాషిణి, డాక్టర్ సుమయ, జిల్లా ఆసుపత్రి డాక్టర్ ప్రసాద్, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ ఎం డి అలీ, సదానందం, పింగల్ అన్న సేవాదళ్ సభ్యులు ఎం డి మోహిన్ , నరేందర్, రఘునందన్, నర్సింహ రెడ్డి, రవికుమార్, శేఖర్ యాదవ్, ఎం డి షానూర్, జశ్వంత్( నాని) ,చాట్ల శేఖర్ పాల్గొన్నారు.
రక్త దానం చేయడం.. సామాజిక బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



