Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ తీసుకొని గ్రౌండింగ్ చేయాలి 

ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ తీసుకొని గ్రౌండింగ్ చేయాలి 

- Advertisement -

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి 

అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ తీసుకుని గ్రౌండింగ్ చేయని లబ్ధిదారులతో వేగంగా గ్రౌండింగ్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ అమరచింత మున్సిపల్ కార్యాలయంలో అమరచింత, ఆత్మకూరు పురపాలక అధికారులతో ఇంకా గ్రౌండింగ్ చేయకుండా పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమరచింత, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ తీసుకుని గ్రౌండింగ్ చేయని లబ్ధిదారులతో వేగంగా గ్రౌండింగ్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాబోయే వారం రోజుల్లో పెండింగ్ వాటిలో 50 శాతం ఇండ్లు గ్రౌండింగ్ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వం కల్పించిన మంచి అవకాశం అని వివరించి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించుకునే విధంగా చొరవ తీసుకోవాలన్నారు.

ఇదివరకే ఇలా నిర్మాణాలు ప్రారంభించి పేమెంట్లు పొందిన లబ్ధిదారులతో మాట్లాడించాలన్నారు.  మండలాల పరిధిలో ఎంపీడీవోలు సైతం ఇళ్ల నిర్మాణాలు వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులను పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశం గురించి తెలియజేసి ప్రోత్సహించాలని చెప్పారు. ఇందిరా మహిళల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంలో ఇసుక ఇబ్బందులు లేకుండా తహసిల్దార్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 

 శిక్షణ కు ఇన్చార్జిలు హాజరు కాకపోవడం పై ఆగ్రహం
మండల పరిధిలోని పామిరెడ్డిపల్లి గ్రామ రైతు వేదికలో వరి కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు మండల స్థాయిలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమానికి వచ్చిన కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు, ఆపరేటర్ల అటెండెన్స్ ను కలెక్టర్ పరిశీలించారు. చాలావరకు పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు ఆపరేటర్లు శిక్షణ కార్యక్రమానికి హాజరు కాకపోవడం పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షణ కార్యక్రమానికి రాకపోతే ధాన్యం కొనుగోలు ఎలా చేపడతారని అసహనం వ్యక్తం చేశారు.

శిక్షణ కార్యక్రమానికి పిఎసిఎస్ ల ఇన్చార్జిలను రప్పించడంలో విఫలమైన సంబంధిత మండల వ్యవసాయ అధికారులకు, పాక్స్ సిబ్బందికి షోకాస్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారికి కలెక్టర్ ఆదేశించారు. అందరూ ఇన్చార్జిలను, ఆపరేటర్లను తప్పనిసరిగా పిలిపించి మళ్లీ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ డిఈ విటోబా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్, జిల్లా సహకార శాఖ అధికారిని రాణి, పౌర సరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ లు చాంద్ పాషా, రవికుమార్, మున్సిపల్ కమిషనర్లు శశిధర్, నాగరాజు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -