- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా ఆదేశాల మేరకు డిఎస్పీ నరసింహ చారి, అధ్యక్షులు రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నకిరేకల్ పట్టణంలో పోలీస్ అమరవీరుడు మెట్టు లింగయ్య ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. ఎలాంటి సమస్యలు వచ్చిన పోలీస్ శాఖ అండగా ఉంటుందని తెలిపారు.
- Advertisement -



