Monday, May 19, 2025
Homeక్రైమ్మటన్‌ ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

మటన్‌ ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

- Advertisement -

– కోటగిరి మండలంలో ఘటన
నవతెలంగాణ-పొతంగల్‌ (కోటగిరి)

మటన్‌ ముక్క ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గొంతులో ముక్క ఇరుక్కోవడంతో వాంతులు చేసుకున్న ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం సుద్దులం తండాలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండలంలోని బొప్పాస్‌పల్లి గ్రామానికి చెందిన రుత్వన్‌ తారసింగ్‌ (48) అనే వ్యక్తి తన భార్య రుత్వన్‌ యమున బాయితో కలిసి ఆదివారం నిజామాబాద్‌ జిల్లాలోని కోటగిరి మండలం సుద్దులం తండా గ్రామంలో తమ బంధువుల ఫంక్షన్‌కు వెళ్లాడు. అక్కడ బంధువులతో కలిసి భోజనం చేస్తుండగా మటన్‌ ముక్క గొంతులో ఇరుక్కుంది. దాంతో తీవ్రంగా వాంతులు చేసుకున్న ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ సునీల్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -