Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్థిక కష్టాలు ఉన్నా.. సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం..

ఆర్థిక కష్టాలు ఉన్నా.. సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం..

- Advertisement -

డిసెంబర్ లో మరో 3500 ఇందిరమ్మ ఇండ్లు..
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో మంత్రి వివేక్ వెంకటస్వామి 
నవతెలంగాణ – దుబ్బాక 

“గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం రూ. 8 లక్షల కోట్ల అప్పులపాలయ్యింది. వారు చేసిన అప్పులకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రతి నెలా రూ.5 వేల కోట్ల మిత్తి (వడ్డీ)లను కడుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సంక్షేమ పథకాలను ఆపడం లేదు. డిసెంబర్ నెలలో ప్రతీ నియోజకవర్గానికి మరో 3500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది.” అని రాష్ట్ర ఉపాధి, కార్మిక, గనుల శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం నగరం గ్రామ శివారులోని రామలింగేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైనారు.

దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 481 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి లతో కలిసి ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రెండేళ్లలోనే జిల్లాలో 26 వేల కొత్త రేషన్ కార్డులను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కార్ దే నని నొక్కి చెప్పారు. రూ. 12 వేల కోట్లతో సన్న బియ్యం అందిస్తున్నామని, త్వరలోనే నియోజకవర్గంలో పాడైన రోడ్ల కోసం నిధుల్ని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 600 చదరపు గజాల లోపు కడితేనే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు డబ్బులు పడుతున్నాయని, ఇది పూర్తిగా కంప్యూటర్ ఆధారిత చెల్లింపులు అని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి నిధుల్ని మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రిని కోరగా.. సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్.. త్వరలోనే మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -