గంట వ్యవధిలో 9మంది శునక కాటుకు గురి
ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు
నవతెలంగాణ – చారకొండ
ప్రవిత్ర దేవాలయం సీతారామ చంద్ర స్వామి దేవాలయ గ్రామ పంచాయతీ సిర్శనగండ్లలో ఒక్కరోజు దాదాపు గంట వ్యవధిలో తొమ్మిది మంది పై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. అయినా అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కొన్ని రోజుల గా వరుసగా కుక్కలు ప్రజలపై దాడులు చేస్తుండటంతో జనాలు ఇళ్ళలో నుండి బయటకు రావడానికి, అదేవిధంగా పాఠశాల వెళ్ళే పిల్లలు, ఆరుబయట ఆడుకునే పిల్లలపై కుక్కలు ఎప్పుడు దాడిచేస్తాయో అని బయపడుతున్నారు.
దీంతో స్పందించిన గ్రామ యువకులు గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నోరకాలుగా విన్న వించిన సంబంధిత అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అదే విధంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల లో కూడా శునకాల సంఖ్య మితిమీరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పై అధికారులకు సమాచారం ఇచ్చాం..
ప్రజల పై కుక్కల దాడిచేసిన సంఘటన పై గ్రామ పంచాయతీ అధికారి లక్ష్మీ చరవాణిలో వివరాలు కోరగా సమస్య తీవ్రంగా ఉందని, దాని పై చర్యలు తీసుకోవాలని కొందరు గ్రామ యువకులు లిఖిత పూర్వకంగా తెలిపారని, అందులో భాగంగా సంబంధిత మండల అధికారులకు తెలియజేశామని అన్నారు.