Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజీబీవీ పాఠశాలలో అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

కేజీబీవీ పాఠశాలలో అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

- Advertisement -

-మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి..
నవతెలంగాణ – రాయపోల్
రాయపోల్ మండల కేంద్రంలో కేజీబీవి పాఠశాలలో అసిస్టెంట్  కుక్ పోస్టు ఖాళీగా ఉంది.అసిస్టెంట్ కుక్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి తాత్కాలిక ప్రతిపాదికన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని రాయపోల్ మండల విద్యాశాఖ అధికారి ఏ. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీబీవీ పాఠశాలలో అసిస్టెంట్ కుక్ గా పనిచేసేందుకు స్థానికులైన మహిళలకు ఏడవ తరగతి చదివిన వారై, 360 మందికి వంట చేయగల సామర్థ్యం కలిగి అనుభవం కలిగిన వారు అర్హులని తెలిపారు.

ఈ పోస్టుగాను రాయపోల్ మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో ఈ నెల 23 తేదీ నుంచి 27 వ తేదీ లోపు దరఖాస్తుతో పాటు పాస్ ఫోటో ,ఆధార్ కార్డ్ మరియు అనుభవం గల ధ్రువీకరణ పత్రాలు జతపరిచి కేజీబీవీ పాఠశాల యందు స్పెషల్ ఆఫీసర్ కు అందజేయాలని పేర్కొన్నారు. అనంతరం ఇంటర్వ్యూ డెమో నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.  పైన పేర్కొన్న తేదీలలో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని  మండల విద్యాధికారి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -