Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈ నెల 25న పాలకుర్తిలో రక్తదాన శిబిరం 

ఈ నెల 25న పాలకుర్తిలో రక్తదాన శిబిరం 

- Advertisement -

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి : ఎస్సై పవన్ కుమార్ 
నవతెలంగాణ-పాలకుర్తి

పోలీస్ అమరుల దినోత్సవం పరస్కరించుకొని ఈనెల 25న మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఎస్సై దూలం పవన్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 21న పోలీసులు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా వరంగల్ సిపి, జనగామ డిసిపి ఆదేశాల మేరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని యువతకు పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరంలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. రక్తదానం చేసే యువకులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, యువజన సంఘాల బాధ్యులు ముందస్తుగానే పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఉత్సాహవతులైన యువకులు రక్తదాన శిబిరానికి హాజరై రక్తాన్ని దానం చేయాలని, రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -