Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలల తనిఖీ

జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలల తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో  గద్వాల పట్టణంలోని వీరాపురం గ్రామంలోని తెలంగాణ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల, ఇటిక్యాల మండలం ఎర్రవల్లి గ్రామంలోని కస్తూర్బా  పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల, కళాశాలలోని సమస్యలను ఉపాధ్యాయులు,  విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ మాట్లాడుతూ.. వారికి అందుతున్న సౌకర్యాలు, వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. బాల్యవివాహాల చట్టాల గురించి లైంగిక వేధింపులు, పోక్సో చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.  మెనూ ప్రకారం భోజన పథకం ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సదుపాయాలను పరిశీలించారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయధికార సంస్థ హెల్ప్ లైన్ నెంబర్ 15100 మరియు చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వి. రాజేందర్ బి. శ్రీనివాసులు, లక్ష్మణస్వామి  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -