Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంకౌలు రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలి

కౌలు రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలి

- Advertisement -

– రైతు స్వరాజ్య వేదిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం కౌలు రైతులకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతు స్వరాజ్య వేదిక నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆ వేదిక నేతలు విస్సా కృష్ణ, కొండల్‌రెడ్డి, కన్నెగంటి రవి, ఎస్‌. ఆశాలత, కౌలు రైతులు కురవ మంజుల, ఎడ్ల మానస, రమాకాంత్‌ మాట్లాడారు. 2011 సాగుదారు గుర్తింపు కార్డుల చట్టాన్ని 2025 ఖరీఫ్‌ నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ”కౌలు రైతుల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. రేవంత్‌ సర్కార్‌ వస్తే తమకు న్యాయం జరుగు తుందని ఆశించిన కౌలు రైతులు నిరాశకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం 2025 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి కౌలు రైతుల గుర్తింపు కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం ప్రకారం కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ”మా ప్రభుత్వానికి కౌలుదారులతో సంబంధం లేదు” అని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే తమకి న్యాయం జరుగుతుందని భావించిన తమకు ఇప్పటి వరకు నిరాశే ఎదురైందంటూ కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -