టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా ప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి సోషల్ మీడియా ప్రతినిధులకు సూచించారు. బుధవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా మండల, గ్రామ కోఆరనేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృషి చేస్తున్నారని, అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలను అందించడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని తెలిపారు.
ప్రజా ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయడంలో సోషల్ మీడియా ప్రతినిధులు ముందుండాలని సూచించారు. సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మగా వ్యవహరించాలని సూచించారు. గత 15 సంవత్సరాలుగా పాలకుర్తి లో పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనులు పూర్తి కాకపోవడంతో రైతులకు సాగునీరు అందలేదని, కాలువలు పూడికతో పాటు ముండ్ల చెట్లతో దర్శనమిచ్చాయని తెలిపారు. తమ సొంత ఖర్చులతో కాలువల్లో పూడికను తొలగించామని, చెట్లను తొలగించి రైతులకు సకాలంలో సాగునీరు అంది ఎందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.
పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనులు రెండేళ్లలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే కృషి ఫలితమే రాష్ట్ర క్యాబినెట్ నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా ప్రతినిధులు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, వాటిని ప్రజల్లోకి తీసుకు వళ్లడం బాధ్యతగా పనిచేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి, ప్రజా ప్రభుత్వానికి సోషల్ మీడియా వారధిగా పనిచేయాలని తెలిపారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సోషల్ మీడియా ప్రతినిధులు వ్యూహాలను రూపొందించి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. సోషల్ మీడియా ప్రతినిధులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను, కుట్రలను తిప్పి కొట్టడంలో సోషల్ మీడియా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
సోషల్ మీడియా ప్రతినిధులు బాధ్యతగా పనిచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES