Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదిత్య పాఠశాలలో మాదకద్రావ్యాలపై అవగాహన

ఆదిత్య పాఠశాలలో మాదకద్రావ్యాలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
జిల్లా మహిళా అభివృద్ధి, శిశు వికలాంగుల వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  నిర్వహించిన  నషా ముక్త్ భరత్ అభియాన్, మాదక ద్రవ్యాల వాడకం లేని స్థిరమైన సమాజన్ని నిర్మిచoడంలో భాగంగా స్థానిక  పట్టణం లోని ఆదిత్య పాఠశాల లో బుధవారం విద్యార్థుల కి  జిల్లా కౌన్సెలర్ భరత్ తేజ అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలు అంటె ఏమిటి? వాటు రకాలు, డ్రగ్స్ అనేవి  నేటి సమాజం లో ఎలా అందుబాటులో కి వచ్చాయి అవి ఆరోగ్యం, భవిష్యత్ పైన ఎటువంటి చెడు ప్రభావన్నీ చూపిస్తాయో తెలియచేసారు. విద్యార్థులకి డ్రగ్స్ తీసుకొనే వ్యక్తులను ఏ విధంగా గుర్తు పట్టాలి. వారిని డ్రగ్స్ భారీ నుండి ఎలా కాపాడలి, న్యాయపరంగా ఎటువంటి శిక్షలు వుంటాయో తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల కరెస్పాండంట్ మారుతీ అమరేందర్ రెడ్డీ, ప్రిన్సిపాల్ బంటు నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ కట్టా అనిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -