నవతెలంగాణ -చిన్నకోడూరు
ఉద్యోగం ఒక బాధ్యత సామాజిక సేవగా గుర్తించి ఎంత ఎదిగిన వొదగినట్టు ఉండే మండల విద్యాధికారి యాదవ రెడ్డిని అభినందించక తప్పదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని పెద్ద కోడూరు ఫంక్షన్ హాల్ లో యాదవ రెడ్డి పదవి విరమణ వీడుకోలు సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యోగం ఒక సామాజిక బాధ్యత గా నిర్వర్తించి అందరి మన్ననలను పొందాడన్నారు. పదవ తరగతి ఫలితాల సాధనలో పట్టుదలతో కృషి చేశారని, ఉత్తమ ఫలితాలు సాధించడం లో ఎంతో ఉత్సాహంతో పని చేసారన్నారు.
నేడు పదవికి విరమణ కావొచ్చు.. కానీ మీ సలహాలు సూచనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. వారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన ఉపాధ్యాయ సమస్య లు, విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు, స్కావేంజర్స్ సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వెరైటీ రాధాకృష్ణ శర్మ, మాజీ జెడ్పి చైర్ పర్సన్ నేటి రోజా రాణి, మాజీ ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు, మండల ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.