Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవీన్ యాదవ్ రౌడీ అనడం సరికాదు..

నవీన్ యాదవ్ రౌడీ అనడం సరికాదు..

- Advertisement -

బీసీలకు టికెట్ ఇస్తే బీసీలను రౌడీలు అంటారా..
కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్ 
నవతెలంగాణ – చిన్నకోడూరు 

నవీన్ యాదవ్ ను రౌడీ ఆనడం సరికాదని రాజకీయ నాయకుడని,  టికెట్ ఇస్తే ఓర్చుకోలేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు ఎంతవరకు సమంజసమని సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్ యాదవ్ అన్నారు. బుధవారం  చిన్నకోడూరు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ఓటమి భయంతో తప్పుడు కూతలు కూస్తున్నారన్నారు. 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసిందే మీ లేదన్నారు. దొంగే వచ్చి దొంగ దొంగ అన్నట్టుగా సుధీర్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. బీసీలపై తప్పుడు కూతలు కూస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. సుధీర్ రెడ్డి పై సుదీర్ఘ విచారణ జరిపి చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకోలు చేసి నిర్బంధం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కరుణాకర్, రాజేందర్, ప్రశాంత్ రెడ్డి,  బాబు,ఎల్లయ్య తది తరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -