- Advertisement -
నవతెలంగాణ – సారంగాపూర్
పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా బుధవారం పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్రీకాంత్ విద్యార్థిని విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ గురించి, రిసెప్షన్, స్టేషన్ రైటర్, వి హెచ్ ఎఫ్ సెట్, టెలికాన్ఫరెన్స్, ఆన్ లైన్ ఎఫ్ఐఆర్, పార్టు మ్యాప్, ఆయుధాలు భద్రపరచు రూమ్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్, మైనర్ డ్రైవింగ్ చేయవద్దని, మోటర్ వాహనాల చట్టాలవ్ వివిధ రకాల బందోబస్తు గురించి, విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రంలో పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, ఆకాష్,రవి , ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -