Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో ఇందిర ఆవాజ్ చెక్కర్ సర్వే

గ్రామాల్లో ఇందిర ఆవాజ్ చెక్కర్ సర్వే

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని నాగపూర్, ఉప్లూర్ గ్రామాల్లో బుధవారం ఇందిర ఆవాస్ ప్లస్ 2024 చెక్కర్ సర్వే నిర్వహించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారుల్లో హౌసింగ్ ఏఈ, పంచాయతీ కార్యదర్శి 10 శాతం చొప్పున ఇందిర ఆవాస్ ప్లస్ 2024 చెక్కర్ సర్వే పూర్తి చేయగా తన వంతుగా ఐదు శాతం సర్వేను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సర్వే ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు నిధులను మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి వారి ఆర్థిక పరిస్థితి, ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల కారా అనే విషయాలను ఆన్లైన్ యాప్ సర్వేలో పొందుపరచడం జరిగిందని వివరించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రాకేష్, పంచాయతీ కార్యదర్శులు సౌందర్య, సంధ్య, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -