Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ధాన్యం కొనుగోళ్ళు ఆలస్యం

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ధాన్యం కొనుగోళ్ళు ఆలస్యం

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి 
నవతెలంగాణ- నకిరేకల్ 

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ధాన్యం కొనుగోళ్ళు ఆలస్యం అవుతున్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం  పట్టణంలోని చీమల గడ్డ ప్రాంతంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలోనీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు అకాల వర్షాల వల్ల కేంద్రాలలోనే ధాన్యం తడిసి ముద్దవుతుందన్నారు. ప్రభుత్వ అధికారులు, మిల్లర్ల మధ్య సమన్వయం లోపం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని అధికారులు, మిల్లర్లను సమన్వయం చేసి కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, మాజీ వైస్ ఎంపీపీ గొర్ల సరిత వీరయ్య, మాజీ సర్పంచ్ చెట్టుపల్లి జానయ్య, నాయకులు చిలువేరు ప్రభాకర్, పేర్ల కృష్ణ కాంత్, గోనె నరసింహరావు, ఇమ్మడపాక  వెంకన్న, దైద పరమేశం, రాచకొండ శ్రవణ్, యానాల లింగారెడ్డి, గుర్రం గణేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -