Thursday, October 23, 2025
E-PAPER
Homeసినిమాదర్శకుడిగానూ నిరూపించుకుంటా..

దర్శకుడిగానూ నిరూపించుకుంటా..

- Advertisement -

సెవెన్‌ హిల్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ‘బట్టల రామస్వామి బయోపిక్‌, కాఫీ విత్‌ ఏ కిల్లర్‌, సోలోబాయ్‌’ సినిమాలను నిర్మించిన నిర్మాత సెవెన్‌ హిల్స్‌ సతీష్‌. నేడు (గురువారం) తన పుట్టినరోజు సందర్భంగా దర్శకుడిగా నూతన ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,’దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఇండిస్టీకి వచ్చాను. అయితే నిర్మాతగా జర్నీ ప్రారంభించి, సినిమా నిర్మాణాన్ని నేర్చుకున్నాను. ఇప్పుడు దర్శకుడిని కావాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. అలాగే నా బ్యానర్‌లో ఇంకో రెండు సినిమాలు నిర్మించ బోతున్నాను. ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి దర్శకత్వంలో ఒక సినిమా, రాజశేఖర్‌ గడ్డం దర్శకత్వంలో మరో సినిమా స్క్రిప్ట్‌ దశలో ఉంది. నార్నె నితిన్‌ హీరోగా ఉగాది రోజున ప్రారంభమైన సినిమా అనుకోకుండా పట్టాలెక్కకపోవడంతో ఆ కథను సరికొత్తగా మార్పు చేసి త్వరలో సినిమా చేస్తున్నాం.

ఈ రెండు సినిమాల అప్‌డేట్స్‌ వచ్చే ఏడాదిలో ఇస్తాను. ‘సోలోబాయ్‌’ ఈవెంట్‌లో నా గురువు వీవీ వినాయక్‌ చెప్పిన విధంగా డైరెక్టర్‌ అవ్వాలనే ప్రయత్నాన్ని ఈ పుట్టినరోజు సందర్భంగా మొదలు పెడుతున్నాను. నా స్నేహితుల సహాయంతో వాళ్ల నిర్మాణంలో నా తొలి సినిమా డైరెక్షన్‌ చేస్తాను. తొలిసారి మీడియా సమక్షంలో కేక్‌ కట్‌ చేసి, బర్త్‌ డే జరుపుకోవడం కొత్తగా ఉంది. ప్రభాస్‌ పుట్టినరోజే తన బర్త్‌ డే కావడం మరింత హ్యాపీగా ఉందన్నారు. డైరెక్టర్‌గా నేను ఏంటనేది నిరూపించుకుంటే తర్వాత పాన్‌ ఇండియా సినిమా చేయడానికి సిద్ధం. నా ఫేవరెట్‌ హీరో నాని. ఆయనతో సినిమా చేయాలని ఉంది. మంచి కంటెంట్‌తో దర్శకుడిగానూ నిరూపించుకుంటాననే నమ్మకం ఉంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -