కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో ఘటన
నవతెలంగాణ-కొండపాక
ఆటోలు సరిగ్గా నడవకపోవడంతో ఉపాధి దొరక్క.. కుటుంబ పోషణ భారమైంది. దాంతో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండటం తో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామం లో బుధవారం జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మార్వాడి దేవదానం(33) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అయితే కొంతకాలంగా ఆటోలు సరిగా నడవకపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. దాంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే ‘ఆటోలు నడవట్లేదు.. వేరే ఏదైనా పని చేస్తేనే కుటుంబం సాగుతుంది. ఏం చేయకపోతే ఎలా’ అని భార్య కోపడింది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను బుధవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయి గ్రామ శివారులోని చెట్టుకు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు కుకునూరుపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
ఆటోలు నడవక.. ఉపాధి దొరక్క..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES