- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల కోసం కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ఈ రోజుతో తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 2,620 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. చివరి రోజు కావడంతో దరఖాస్తుదారుల నుంచి భారీ స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం బీసీ బంద్, కొన్ని బ్యాంకులకు సెలవులు ఉండటంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని పలువురు విజ్ఞప్తి చేయడంతో, ఎక్సైజ్ శాఖ గడువును మరో రెండు రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ గడువు రెండు రోజుల క్రితమే ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల సౌకర్యార్థం అక్టోబర్ 23 వరకు పొడిగించారు.
- Advertisement -