నవతెలంగాణ – హైదరాబాద్ : గచ్చిబౌలీ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరిస్థితి విషమంగా మారిందని బుధవారం రాత్రి వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై మంచిర్యాల కాంగ్రెస్ శ్రేణులతో పాటు ఎమ్మెల్యే అనుచరులు స్పందించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పరిస్థితి విషమం అనే వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం గచ్చిబౌలీ ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని చెబుతున్నారని, నిన్న సాయంత్రం కుడా పార్టీ శ్రేణులతో మాట్లాడినట్లు తెలుస్తుంది. అయితే ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ రావాలంటే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కానీ, ఏఐజీ ఆస్పత్రి డాక్టర్లు కానీ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES