Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంమీసేవా ఉద్యోగుల వేతనాలు పెంచాలి

మీసేవా ఉద్యోగుల వేతనాలు పెంచాలి

- Advertisement -

– పెండింగ్‌ సమస్యల్ని పరిష్కరించాలి : మీసేవా ఈఎస్‌డీ కమిషనర్‌ రవికిరణ్‌కు
– తెలంగాణ మీసేవా ఎంప్లాయీస్‌ యూనియన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం మీసేవా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి కనీస వేతనాలను పెంచాలని తెలంగాణ మీసేవా ఎంపాయ్లీస్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు జె.వెంకటేశ్‌, అధ్యక్షులు ఆర్‌.సురేశ్‌, ప్రధాన కార్యదర్శి జెనీమా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో మీసేవా ఈఎస్‌డీ కమిషనర్‌ రవికిరణ్‌కు వారు వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రవేశపెడుతున్న అనేక సేవల వల్ల మీసేవా ఉద్యోగులపై భారం పెరుగుతున్నదని వాపోయారు. రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులు, మున్సిపల్‌ సేవలకు సంబంధించిన బర్త్‌ సర్టిఫికెట్లలో సవరణలు, తదితర సేవలు ఇటీవలి కాలంలో పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. అంత కష్టపడుతున్నా వారికి కనీస వేతనం దక్కట్లేదని వాపోయారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను పెంచాలని విన్నవించారు. వార్షిక బోనస్‌, ఇన్సెంటీవ్‌లో ఏదో ఒకదానిని ప్రతి ఏటా చెల్లించాలని కోరారు. పనిభారం తగ్గించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. రూ.10 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవిం చారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్‌ కోశాధికారి ఎవీబీ లక్ష్మి, సహాయ కార్యదర్శి కవిత, ఉపాధ్యక్షలు బి.బాల్‌రాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -