ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
పొంగిపొర్లుతున్న రోడ్లు, వాగులు
మరో రెండు రోజులపాటు తప్పని వర్షాలు
నవతెలంగాణ – మిర్యాలగూడ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. బంగాళాఖాతంలో ఈదురు గాలులు బలపడుతుండడంతో ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో మోస్తారు వర్షం పడుతుంది. మొన్న మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా పెద్ద వర్షం కురిసింది. సుమారు గంటపాటు వర్షం కురవడంతో వాగులు, వంకలు, మురికి కాలువలు నిండిపోయి రోడ్లపై వర్షపునీరు ప్రవహించింది. మంగళవారం ఒక్కరోజే 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఒక మోస్తారుగా వర్షం కురిసింది.2.0 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.
కాగా తాజాగా గురువారం ఉదయం నుంచి వాతావరణం మబ్బులు పట్టి ఉంది. చల్లని వాతావరణం, మేఘాలు మబ్బులు పట్టి ఉండడంతో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. గురువారం మధ్యాహ్నం మోస్తారుగా వర్షం కురిసింది. నియోజవర్గం వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి పైర్లు గింజ పోసుకునే దశలో చేరుకోవడంతో అకస్మతుగా వర్షాలు కురుస్తున్నంతో వరి పైర్లు నేలకొరిగి పోతున్నాయి. గింజలు రాలి నేలపాలవుతున్నాయి. దీంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఐకేపి కేంద్రాల్లో పోసుకున్న ధాన్యం తడిసి ముద్దవుతుండగా, చేతికొచ్చిన వరి పైర్లు నెలవారి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.
మిర్యాలగూడలో వర్షం ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES