నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయడం విషయమై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో భాగంగా లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యి ఇప్పటివరకు మార్కింగ్ చేయని లబ్ధిదారులతో ఆయన చర్చించారు. త్వరగా మార్కౌట్ పనులను పూర్తి చేసుకోవాలన్నారు. మార్కౌట్ చేసి ఇప్పటివరకు ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులు నిర్మాణాలను ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఆంధ్రయ్య, హౌసింగ్ ఏఈ రాకేష్, పంచాయతీ కార్యదర్శి నవీన్, కిషన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES