నవతెలంగాణ – రామన్నపేట
రైతుల కష్టాలు, నష్టాలు రైతుల చుట్టూ వైపే లా ఉంటాయి అనడానికి ఇప్పుడు రైతుల ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలే ఉదాహరణ. వర్షాకాలం ప్రారంభమైన నెల రోజుల వరకు చుక్క వర్షం పడని సందర్భం ఉండగా… పంటలు చేతికొచ్చి వరి ధాన్యాన్ని కోసే దశలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రైతులు అనేక కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రెండు మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఎంతో కొంత వర్షం పడిపోతూనే ఉంది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా రామన్నపేట పట్టణంలో, బోగారం ఇంద్రపాలనగరం గ్రామాలలో వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వడ్లు మళ్లీ తడిసిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన, తూకాలు ప్రారంభం కాకపోవడంతో ఇంకెంత నష్టం చవిచూడాల్సి వస్తుందోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకాలు వెంటనే ప్రారంభించాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES