Thursday, October 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మామిడిపల్లి పాఠశాలలో క్రీడాకారులకు అభినందన సభ 

మామిడిపల్లి పాఠశాలలో క్రీడాకారులకు అభినందన సభ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు గురువారం క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించినారు. ఇటీవల మండల స్థాయి అర్బన్ క్రీడలలో గెలిచిన క్రీడాకారులకు అభినందన సభ ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమమునకు అధ్యక్షత వహించినటువంటి పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు దొంతుల రవీందర్ మాట్లాడుతూ.. ఖో ఖో జూనియర్స్, సబ్ జూనియర్స్ బాలుర బాలికల విభాగంలో ప్రథమ బహుమతి, మార్చ్ ఫాస్ట్ లో ద్వితీయ బహుమతితో పాటు మొత్తము ఐదు షిల్డులను గెలుపొంది నందుకు విద్యార్థులను, పిఈటి బి.రాజేశ్వర్ ను అభినందించారు. ఈ సందర్భంగా పిఈటి నీ పూలమాల, శాలువా, మెమొంట్తో ఘనంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందము, మామిడిపల్లి వీడీసీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీ డీ సీ సభ్యులు  శ్యామ్, సాయి రెడ్డి శ్రీనివాస్, రాజన్న, ఉపాధ్యాయ బృందము ఎన్ మోహన్. విఠల్, శోభా, లింబాద్రి, రేణుక, భాను ప్రకాష్, గంగా మోహన్, రాజేశ్వర్  లావణ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -