నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పలు వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కమిషనర్ రాజు కు వినతి పత్రం అందజేసినట్టు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. పట్టణంలోని క్షత్రియ స్కూలు, డిఫైన్డ్డం స్కూలు మధ్యలో గల రోడ్డుకు మొరము పొయ్యాలని, డ్రైనేజ్ కట్టించాలని, సీసీ రోడ్డు వెయ్యాలని, ఎస్ఎస్ డ్రింకింగ్ వాటర్, రోడ్డుపై. పైప్లైన్ వెయ్యాలని సీపీఐ(ఎం) పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కాలనీవాసుల సహకారంతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. కమిషనర్ కు సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
సీపీఐ(ఎం) డివిజన్ కమిటీ కార్యదర్శితో పాటు పట్టణ కార్యదర్శి కూతాడి ఎల్లయ్య మాట్లాడుతూ.. క్షత్రియ స్కూల్ నుండి ఎస్ఎస్ డ్రింకింగ్ వాటర్ వరకు మొరం పోయాలని, డ్రైనేజ్ కట్టాలని, సీసీ రోడ్లు పోయాలని, టీచర్ కాలనీ, రాజారాం నగర్ కాలనీ నుండి దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు స్కూలుకు వెళ్లడానికి దారి సక్రమంగా లేక పిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
లేఅవుట్ ప్లాన్ లేకున్నా..ఇష్టం వచ్చిన రీతిలో ఇండ్లను కట్టడాల నిర్మాణం చేయుచున్నారు అని అన్నారు. సెప్టిక్ ట్యాంక్ వాటర్ బాత్రూం వాటరు, రోడ్డుపైన ఏరులై పారుతున్నాయని అన్నారు. వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది పదుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారినా.. పదో వార్డు, 28వ వార్డు పరిస్థితి మాత్రం మారలేదని అన్నారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడి మాదిరిగానే ఉన్నది అన్నారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా టీచర్స్ కాలనీ పదో వాడు పరిస్థితి దయానియా స్థితిలో ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పులి గంగాధర్ ఎండి జైనుద్దీన్, ఎండి రహీం ,సాయిలు, సారయ్య, భీమయ్య ,రాములు ,సంతు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.