నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్మూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం నివారణపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వ్యసనాన్ని అరికట్టేందుకు, విద్యార్థుల్లో చైతన్యం పెంపునకు భాగంగా ఈ కార్యక్రమంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. నేటి యువతలో మాదకద్రవ్యాల వాడకం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారిందని, విద్యార్థులు ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు, భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని హెచ్చరించారు. వ్యాసరచనలో పాల్గొన్న విద్యార్థులు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, యువతకు ప్రభుత్వం , పోలీస్ శాఖ అందిస్తున్న అవగాహన కార్యక్రమాల ప్రాముఖ్యత వంటి అంశాలపై తమ ఆలోచనలను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నరేందర్, ఏఎస్ఐ సుశీల్ కుమార్, ప్రశాంత్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.