Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెల్లంకి విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్ అందజేసిన దివిస్

వెల్లంకి విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్ అందజేసిన దివిస్

- Advertisement -

నవతెలంగాణ – రామన్నపేట
మండలంలోని వెల్లంకి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 170, ప్రాథమిక పాఠశాలలోని 160 విద్యార్థులకు దివిస్ లాబరేటరీస్ వారు కో-ఆపరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా సుమారు రెండు లక్షల రూపాయల విలువైన స్కూల్ బ్యాగ్స్, నోట్ బుక్స్ ను హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి సురేందర్ రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉపాధ్యాయుల, విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ సి ఎస్ ఆర్ గోపి, సహాయకులు వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంపెనీ సి ఎస్ ఆర్ గోపి మాట్లాడుతూ.. దివిస్ లాబరేటరీ వారు అందజేసే ఈ అవకాశాన్ని సద్వినిగం చేసుకోవాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ .. కంపెనీవారు పేదలు చదివే ఈ పాఠశాలల విద్యార్థులకు చేయూతనివ్వడం అభినందనీయమని, స్వాగతీయమని వారన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత విద్యలో రాణించాలని సూచించారు. దివిస్ కంపెనీ యాజమాన్యానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండు పాఠశాలలు ఉపాధ్యాయుని, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -