Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయం106 కిలోల గంజాయి పట్టివేత

106 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -

– ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమ రవాణా
– ఎక్సైజ్‌ అడిషనల్‌ కమిషనర్‌ యాసిన్‌ ఖురేషి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ గంజాయి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ హెచ్‌సీఎల్‌ ప్రాంతంలోని ఓ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 106 కిలోల గంజాయిని అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆశాఖ అదనపు కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషి వివరాలు వెల్లడించారు. గోప్యమైన సమాచారం ఆధారంగా డీటీఎఫ్‌, ఉప్పల్‌ ఎక్సైజ్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారని తెలిపారు. మల్లాపూర్‌ ఎచ్‌సీఎల్‌ ఉప్రాంతంలోని ఓ పాడుబడిన గోదాం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఒడిశా నుంచి కారులో హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయి తరలించారని వెల్లడించారు. వారిచ్చిన సమాచారం మేరకు గోదాంలో తనిఖీ చేయగా, 2 కిలోల చొప్పున 56 ప్యాకెట్లు, కిలో చొప్పున 6 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుకున్న గంజాయి విలువ మార్కెట్‌ రేట్‌ ప్రకారం రూ.53 లక్షలని తెలిపారు. కేసులో ఏ1గా ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన రాంబాబు, ఏ 2గా ఘట్‌కేసర్‌కు చెందిన కట్ల వివేక్‌ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నామనీ, మూడో నిందితుడుగా ఉన్న దగ్గుమల్లి మధుకిరణ్‌ పరారీలో ఉన్నట్టు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఎన్‌ఫోర్స్‌ మెంట్‌, ఎస్టీఎఎఫ్‌, డీటీఎఫ్‌ టీమ్‌లతోపాటు స్థానికంగా ఎక్సైజ్‌ శాఖ అధికారులు డ్రగ్స్‌పై ప్రత్యేకంగా దాడులు నిర్వహిస్తున్నారని ఖురేషి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ పి.దశరథ్‌ మల్కాజిగిరి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నవీన్‌ కుమార్‌, ఏఈఎస్‌ ముకుందరెడ్డి, ఉప్పల్‌ ఎస్‌హెచ్‌ఓబీ. ఓంకార్‌, డీటీఎఫ్‌ సీఐ భరత్‌ భూషన్‌, ఎస్సైలు నరేశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -