నవతెలంగాణ – రామన్నపేట
రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామ పెద్ద చెరువుకు, రామన్నపేట వెంకట్రామయ్య చిన్న చెరువుకు వేగవంతంగా విస్తరణ, ఆధునికీకరణ పనులు జరుగుతున్న ధర్మారెడ్డి పల్లి కాల్వ నుండి ఫీడర్ ఛానల్, తూములు ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ నీటి సంఘం చైర్మన్ మన్సూర్ అలీ గురువారం మండల కేంద్రంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారెడ్డిపల్లి కాల్వ విస్తరణ, ఆధునికీకరణ నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నందున ఈ చెరువులకు ఫీడర్ ఛానల్, అవసరమున్న, రైతులు కోరిన చోట తూములు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
ఫీడర్ ఛానల్ లేకపోవడం మూలంగా ఇటీవల భారీగా, విస్తారంగా వర్షాలు పడినప్పటికీ ఆ వర్షపు నీరు మా గ్రామాల చెరువులోకి చేరకుండా పోతున్నాయని ఆయన అన్నారు. కాల్వ పైనుండి వచ్చే వర్షపు నీరు కాలువ అడ్డంగా ఉండడం వల్ల కాలువలో పడిపోతున్నాయని ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు కాల్వకు సూపర్ పాసెస్, అండర్ ప్రాసెస్ లో ఏర్పాటు చేసి చెరువులోకి నీరు వచ్చే విధంగా చూడాలని అని కోరారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
రామన్నపేట చెరువులకు ఫీడర్ ఛానల్ ఏర్పాటు చేయాలని సంతకాల సేకరణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES