Friday, October 24, 2025
E-PAPER
Homeకరీంనగర్దళారులను ఉన్న రైతులు మోసపోవద్దు..

దళారులను ఉన్న రైతులు మోసపోవద్దు..

- Advertisement -

వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి 

రైతులు పండించిన పంటను ఐకెపి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుగుల స్వరూప తిరుపతి రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండలంలోని రాళ్లపేట గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ నాయకులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలలో లభిస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి కొనుగోలు కేంద్రాల ద్వారానే రైతులు వరి ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ పరుశరాములు, లింగాల భూపతి,మచ్చ శ్రీనివాస్, రాపల్లి ఆనందం, పెద్దూరు తిరుపతి యూత్ కాంగ్రెస్ నాయకులు ఎగుర్ల ప్రశాంత్, ఎగుర్ల కరుణాకర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -