నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతి పనులను గురువారం ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. ఇటీవల కృష్ణ భారీ వర్షాల మూలంగా నిర్మాణం మందగించిందని, ప్రస్తుతం వాతావరణం బాగున్నందున ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. స్లాబ్ లెవెల్ వరకు ఇలా నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులు వెంటనే మిగతా పనులు పూర్తి చేసుకోవడం ద్వారా గృహ ప్రవేశాలకు ఇళ్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఇంగ నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని, తద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రెండు లక్షల వరకు రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఆయన వెంట హౌసింగ్ ఏఈ రాకేష్, పంచాయతీ కార్యదర్శి శాంతి కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.
ఇండ్ల నిర్మాణ ప్రగతి పరిశీలన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES