- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయ ఆవరణలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రస్ నివారణలో పోలీసుల పాత్ర- డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంలో విద్యార్థుల కర్తవ్యం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎస్.ఐ ఆంజనేయులు పోలీసుల సేవలు, డ్రగ్స్ నివారణ గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
- Advertisement -