యువతలో చైతన్యం.. మత్తు రహిత సమాజమే లక్ష్యం
డోంట్ బీ సైలెంట్ ఆన్ డ్రగ్స్ – ఫొటోస్ ఎగనెస్ట్ డ్రగ్స్ నినాదాలతో రన్ ఆకట్టుకుంది
మాదకద్రవ్య రహిత సమాజమే ‘చైతన్యం’ లక్ష్యం
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ నిర్వహణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “చైతన్యం – మాదకద్రవ్య రహిత సమాజం” పేరుతో గురువారం ఉదయం 2 కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీఐ నాగరాజు రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..“మాదకద్రవ్యాల వల్ల యువత దారి తప్పే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ, మాదకద్రవ్య రహిత సమాజం నిర్మాణానికి కృషి చేయాలి,” అని అన్నారు.
“డోంట్ బీ సైలెంట్ ఆన్ డ్రగ్స్ – ఫొటోస్ ఎగనెస్ట్ డ్రగ్స్” నినాదాలతో నిర్వహించిన ఈ రన్ లో పాల్గొన్నవారు ప్రజల్లో అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట, దమ్మపేట ఎస్‌హెచ్ఓలు, ఎస్సైలు యయాతి రాజు, సాయి కిశోర్ రెడ్డి, అదనపు ఎస్ఐ రామ్మూర్తి, శిక్షణ ఎస్ఐ అఖిల, పోలీస్ సిబ్బంది, యువకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పోలీస్ అధికారులు మత్తు పదార్థాల ముప్పు నుంచి సమాజాన్ని కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.