స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ – మిర్యాలగూడ
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి గుర్తించిన స్థలంలో సరిహద్దులు నిర్ధారించి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలంలోని జప్తి వీరప్ప గూడెం వద్ద ఉన్న సర్వే నంబర్ 214 లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ప్రతిపాదించగా, మొత్తం 22 ఎకరాల స్థలంలో పాఠశాల భవనాల నిర్మాణం చేపట్టేందుకు గాను సరిహద్దులను నిర్ధారించి మ్యాప్ తో సహా పంపించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణంలో భాగంగా తరగతి గదులు, హాస్టల్, డార్మెటరీ, లైబ్రరీ, ల్యాబ్ లు,ఆట స్థలం, ఆడిటోరిమ్, అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పవన్ కుమార్ మిర్యాలగూడ తహసిల్దార్ సురేష్, తదితరులు ఉన్నారు.