Friday, October 24, 2025
E-PAPER
HomeNewsఐపీఎస్ నుంచి ఐఏఎస్ కు గరీమా అగ్రవాల్

ఐపీఎస్ నుంచి ఐఏఎస్ కు గరీమా అగ్రవాల్

- Advertisement -

ఇంచార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన గరీమా అగ్రవాల్
ఆమె ప్రయాణం యువతకు ప్రేరణ
విధినిర్వహణలో తన మార్క్ చూపెట్టనుందా..
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రోజే ఇంచార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు పొందింది. ఐపీఎస్ సాధించిన ఆమె అనుకున్న లక్ష్యాన్ని చేరలేదని చదువే తనకు ఆయుధం అనుకుని లక్ష్యం వైపు అడుగులు వేసి ఐఏఎస్ ను సాధించింది గరీమా అగ్రవాల్. 2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన గరీమ అగ్రవాల్ యువతకు ప్రేరణగా నిలిచింది. తన సోదరి నీ ప్రేరణగా తీసుకొని చదువుకుంది. సోదరి ఇండియన్ పోస్టల్ సర్వీస్ లో పనిచేస్తున్నారు. గరిమ అగ్రవాల్ విధినిర్వహణలో పవర్ ఫుల్ అధికారిగా పేరుండగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తన మార్క్ చూపెట్టనుందా అనే అభిప్రాయం జిల్లా ప్రజల్లో వ్యక్తం అవుతుంది.

ఇంటర్ వరకు సొంత ఊరిలోనే…

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కార్గోన్ పట్టణంలో జన్మించింది. వ్యాపార కుటుంబమైనప్పటికీ ఆమె చిన్నప్పటి నుంచి విద్యలో మొదటి స్థానంలో నిలిచేది. పదవ తరగతి కర్గోన్ లోని సరస్వతీ విద్యా మందిర్ లో చదువుకో గా 92 శాతం మార్కులు సాధించింది అలాగే ఇంటర్మీడియట్ లో 89% మార్కులు సాధించింది. హైదరాబాద్ లోని బీటెక్ (ఇంజనీరింగ్) ఐఐటి పూర్తి చేసి తర్వాత జర్మనీలో ఇంటర్నెట్ షిప్ చేశారు. అలా ఆమె చదువు సాగింది.

2017 లో ఐపీఎస్…2019 లో ఐఏఎస్…

​గరీమా అగ్రవాల్ యూపీఎస్సీ ద్వారా 2017 లో ఆల్ ఇండియా 240వ ర్యాంకు ఆమె సాధించి ఐపీఎస్ కు ఎంపికయ్యారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఆమె శిక్షణ పొందుతూనే ఐఏఎస్ లక్ష్యంగా మళ్ళీ పరీక్షకు సిద్ధమయ్యారు. 2019లో ఆల్ ఇండియా 40 వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ఆమెకు పల్లవ్ టిన్నతో వివాహం అయింది. జర్మనీలోనే ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ జన్మభూమికి సేవ చేయాలనే తపనతో ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది.

వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం…

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ వివిధ జిల్లాల్లో పని చేశారు. కరీంనగర్ అసిస్టెంట్ కలెక్టర్ గా ఆమె పనిచేశారు. తదుపరి సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా పనిచేశారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ హరిత సెలవులో వెళ్ళగా గరీమా అగ్రవాల్ ఇన్చార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆమె సింగిల్ యూజు ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రాష్ట్రంలో అనేక అవగాహన కార్యక్రమాలు చేసింది. ఆమె జీవన చరిత్ర అనేకమందికి స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. ప్రిలిమ్స్ ,మెయిన్స్, ఇంటర్వ్యూలకు కలిపి సమగ్రంగా సిద్ధం కావాలని, స్థిరమైన పునరుచ్చరణ, రెగ్యులర్ మాక్ టెస్టులు ముఖ్యమని యూపీఎస్సీ అభ్యర్థులకు ఆమె సలహాలు ఇస్తుంటారు. ఆమె విద్యకు మొదటి ప్రాధాన్యమిస్తూ సేవా గుణం కలిగి ఉన్నట్లు అర్థమవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -