Friday, October 24, 2025
E-PAPER
HomeNewsప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
జిల్లాలో ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులు పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ప్రతి పాఠశాల సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పదో తరగతి ఫలితాల మెరుగుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ టి డి ఏ పి ఓ, జిల్లా ఇంచార్జి విద్యాశాఖ అధికారి ఖుష్బూ గుప్తాతో కలిసి కలెక్టర్ విద్యార్థుల హాజరు, ఫలితాల మెరుగుదల, బోధన నాణ్యత, శాతం పెంపు చర్యలపై విస్తృతంగా చర్చించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో సమగ్రమైన ప్రణాళికను రూపొందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గత ఏడాది ఎస్.ఎస్.సీ ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత శాతం పెంచే దిశగా ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల్లో ఉత్సాహం నింపేలా ప్రతి పాఠశాలలో మోటివేషన్ సెషన్లు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

అలాగే, ప్రతి పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ ఈ వారంలో తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ క్లాసులు ఏర్పాటు చేయాలని, నవంబర్ 1వ తేదీ నుంచి SSC విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ప్రారంభించి జనవరి 10 నాటికి సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం గ్రాండ్ టెస్ట్–1, గ్రాండ్ టెస్ట్–2 నిర్వహించి విద్యార్థుల సమర్థ్యాలను అంచనా వేయాలని సూచించారు. ఇంగ్లీష్, తెలుగు మాధ్యమ పాఠశాలల్లో బోధన నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థుల హాజరు వంద శాతం నమోదయ్యేలా ఉపాధ్యాయులు, ఎంఈఓలు పర్యవేక్షణ చేయాలని సూచించారు.  అనంతరం వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు స్పోర్ట్స్ కిట్లను జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారి పంపిణీ చేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు గజానాన్, సుజాత్ ఖాన్, జగన్, ఎం ఈ ఓ లు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -