Friday, October 24, 2025
E-PAPER
Homeఖమ్మంఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా ప్రభాస్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
చలన చిత్రం కధానాయకుడు ప్రభాస్ జన్మదినం పురస్కరించుకొని అశ్వారావుపేట ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, వికాస తరంగిణి అశ్వారావుపేట శాఖ, వీకే డీఎస్ విద్యాసంస్థలు (జూనియర్,డిగ్రీ కాలేజ్ లు) సహకారంతో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసారు. ఈ కార్యక్రమంలో వికాస్ తరంగిణి అధ్యక్షులు వేలూరు సుబ్రహ్మణ్యం, వీకేడీవీఎస్ రాజు విద్యాసంస్థలు ప్రిన్సిపాల్ శేషుబాబు, ఆశ్రమం మెడికల్ కాలేజ్ బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి శివ, ఆశ్రమం టిఆర్ఓ మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -