స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యువత పనిచేయాలి
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
యువజన కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పునాదులని టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి, కొడకండ్ల మండలాల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, ధరవత్ సురేష్ నాయక్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాలకుర్తి, కొడకండ్ల మండలాల యూత్ కాంగ్రెస్ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ నాయకులు బాధ్యతగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని దిశా, నిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తుందని, అనేక సహసపేతమైన నిర్ణయాలతో ప్రజాకర్షణ గల పథకాలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధితోపాటు ప్రజాకర్షణ పథకాల అమలు కార్యక్రమాలను ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని సూచించారు. అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసి, ప్రతిపక్ష పార్టీలను మట్టికరిపించాలని యువతకు సూచించారు.
గత 15 ఏళ్లుగా పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్ పనులు పూర్తికాకుండా అర్ధాంతరంగా నిలిచిపోయాయని, పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ పనులను పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రత్యేక చొరవ చూపిందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ పనులను త్వరితగతిన రాబోవు రెండు సంవత్సరాల్లో పూర్తి చసి చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించడంతో పెండింగ్ ప్రాజెక్టులకు మహర్దశ కలిగిందని తెలిపారు. ఈ ప్రాంతం సాగునీటితో సస్యశ్యామలంగా ఉండేందుకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చూపుతున్న చొరవను ప్రజలకు వివరించాలని సూచించారు.
ప్రాజెక్టుల అభివృద్ధితోపాటు గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ పార్టీకే సాధ్యపడుతుందని ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలని కార్యకర్తలకు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించే బాధ్యత యూత్ కాంగ్రెస్ కార్యకర్తలేదేనని, కార్యకర్తలందరూ సమన్వయంతో పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి, కొడకండ్ల మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసు హరీష్ గౌడ్, యాకేష్ లతోపాటు యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
యువతే కాంగ్రెస్ పార్టీకి పునాది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES