విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన.
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సి.హెచ్ సి.హెచ్ సాంబశివ రావు ఆద్వర్యంలో బెటాలియన్లోని ఎం టి పార్క్ ఆవరణలో గల విధ్యా హై స్కూల్, విక్టరీ హై స్కూల్, ప్రభుత్వ పాఠశాల లకు చెందిన విధ్యార్థినీ, విద్యార్థులకు గురువారం “ఓవెన్ హౌస్” కార్యక్రమంలో భాగంగా ఆయుధాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్స్ కె.పి శరత్ కుమార్, ఆర్.ఐ లు, ఆర్.యస్.ఐ లు, బెటాలియన్ సిబ్బంది మరియు విధ్యా హై స్కూల్, విక్టరీ హై స్కూల్, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విధ్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.