Friday, October 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం మొర్రిగూడ రాఘవేంద్ర రైస్ మిల్ సమీపంలోని ప్రధాన రహదారి పై గురువారం ద్విచక్ర వాహనం బొలెరో ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూరు మండలానికి చెందిన దోషన్లో అంకన్న (50 )శ్రీరామ్ మూతిరామ్( 55) ద్విచక్ర వాహనం మీద ఉట్నూరు నుంచి జన్నారం వస్తున్నారు. అదే సమయంలో జన్నారం నుంచి ఉట్నూరు వెళుతున్న బొలోరో వాహనం ఎదురు ఎదురుగా ఢీకొన్నాయి. దీంతో ద్విచక్ర వాహనం మీద ప్రయాణిస్తున్న అంకన్న మోతీరామ్ అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా వెళుతున్న బొలెరో వాహనం అదుపుతప్పి పోలాల్లో బోల్తా పడిపోయింది. బొలెరో వాహన డ్రైవర్ షేక్ అల్మాస్కు ఎలాంటి గాయాలు కాలేదు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -